NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజా దర్బార్‌ కార్యక్రమం లక్ష్యసాధన దిశగా కొనసాగుతోంది

1 min read

జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడి

ప్రజలెదుర్కొంటున్న సమస్యలకు త్వరితగతిన పరిష్కారాలు చూపేందుకు ప్రత్యేక దృష్టిప్రజా దర్బార్‌ కార్యక్రమంలో ప్రజల నుండి ఎమ్మెల్యే బడేటి చంటి వినతులు స్వీకరణ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ప్రజలెదుర్కొంటున్న సమస్యలకు కూడా త్వరితగతిన పరిష్కారాలు చూపేందుకు ప్రత్యేక దృష్టిసారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రజా దర్బార్‌ కార్యక్రమం ప్రతి శుక్రవారం లక్ష్యసాధన దిశగా కొనసాగుతోంది. ఇదేక్రమంలో ఈ శుక్రవారం కూడా స్థానిక పవర్‌ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో ప్రజల నుండి ఎమ్మెల్యే బడేటి చంటి వినతులు స్వీకరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *