NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారత ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలను ఉపసంహారించుకోవాలి

1 min read

ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు    పి. రామచంద్రయ్య

న్యూస్ నేడు, పత్తికొండ:  భారత ప్రభుత్వం అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాలను తక్షణమే ఉపసంహారించు కోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, పి. రామచంద్రయ్య కోరారు.కర్నూలు జిల్లా పత్తికొండలో శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయం చదువుల రామయ్య భవన్ లో రైతు సంఘం కరపత్రం ను విడుదల చేశారు.ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పత్తికొండ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి బి. సురేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం ను ఉద్దేశించి పి. రామచంద్రయ్య మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్. డి. ఏ.  ప్రభుత్వం అమెరికా తో చేసుకున్న వాణిజ్య ఒప్పందం ఫలితంగా అమెరికా దేశం నుండి దిగుమతి చేసుకున్న వివిధ రకాల వాణిజ్య పంటలు కొనేది పూర్తి అయిన తరువాత నే మన దేశంలో రైతులు పండించిన గోధుమ తో పాటు వివిధరకాల పంటలను కొనుగోలు చేస్తారని తెలిపారు. మన దేశ రైతన్నలు పండించిన పంటలకు రెండవ ప్రియరిటి ఇవ్వడం, లేదంటే అసలు కొనే పరిస్థితి లేదని ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం అమెరికా తో వాణిజ్య ఒప్పందం చేసుకున్నాదని, దేశానికీ అన్నం పెట్టె మన రైతన్నలు పండించిన పంట ఉత్పత్తులను కొనకోకుండగా, అమెరికా నుండి దిగుమతి చేసుకున్న పంట ఉత్పత్తులను కొనడం లాంటి ఒప్పందం జరిగిందని ఈ ఒప్పందం వలన మన దేశ రైతులకు చాలా అన్యాయం జరుగుతుందని, ఈ ఒప్పందాన్ని తక్షణమే ఉప సంహారించు కోవాలని అయన డిమాండ్ చేశారు.  ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కనుక రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే రైతులకు,  నాణ్యమైన విత్తనాలు, ఎరువులు 90% సబ్సిడీ ద్వారా ఇవ్వాలని ఆయన కోరారు. నాణ్యతలేని ఎరువులు, పురుగుమందులు అరికట్టాలని కోరారు.   

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *