మహానాడు వేదికగా మహిళా రిజర్వేషన్ కు బలమైన పునాది
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మహిళా సాధికారతకు బాటలు వేసినందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి శ్రీ నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపిన కర్నూల్ జిల్లా టిడిపి అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ –మరియు మహిళా కమిటీ సభ్యులుఈనెల 27 28 తేదీలలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడు లో రానున్న ఎన్నికలలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని ఇది పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందిన ఆమోదం పొందకపోయినా మన రాష్ట్రంలో మాత్రం కచ్చితంగా అమలు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడం పట్ల తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణ మ్మ మరియు తెలుగు మహిళ పార్లమెంటును కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ, కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో ఉన్నటువంటి శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక విశ్వేశ్వర సర్కిల్ నందు మహిళలు 33 శాతం రిజర్వేషన్లకు మద్దతుగా ఆలూరు నియోజకవర్గం పార్టీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి, బొజ్జమ్మ, పద్మలతారెడ్డి సంజీవ లక్ష్మి, ఎస్ జికియ అక్సారి, కోట్ల కవితమ్మ మరియు మహిళలతో కలిసి విశ్వేశ్వరైఅహ్ సర్కిల్ లో ర్యాలీ నిర్వహించడం జరిగింది .అనంతరం జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు విలేఖరుల సమావేశంలో వక్తలు మాట్లాడుతూ మహిళా సాధికారత అనేది మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీని చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకున్నటువంటి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు మహిళా రిజర్వేషన్లు మహిళ సాధికారత పేపర్లకే పరిమితం కాకుండా చేతుల్లో చూపించారని ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా పేర్కొన్నారు. మహిళలకు రాజకీయ స్వేచ్ఛ సముచిత స్థానం కల్పించి వారిని ప్రోత్సాహిస్తున్నది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని గుర్తు చేసుకున్నారు మహిళలకు గౌరవము అవకాశాలు నాయకత్వం కల్పించే పార్టీ కూడా తెలుగుదేశం పార్టీని అన్నారు మహిళలకు అస్తి హక్కు సామాజికంగా రాజకీయంగా ప్రోత్సహించడం వంటి వాటిలో తెలుగుదేశం పార్టీని మించినది మరే పార్టీ లేదని చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ కూడా తెలుగుదేశం పార్టీని తెలిపారు. విద్య ఉద్యోగాల్లో పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పించింది మొట్టమొదటిసారిగా శాసనసభ స్పీకర్ ఒక మహిళకు అవకాశం కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీని అన్నారు.మహిళా సాధికారతే టిడిపి లక్ష్యం మహిళలకు ఆర్థికంగా స్వావలంబన కల్పించే దిశలో భాగంగా 12 లక్షల డ్వాక్రా గ్రూపులను బలోపేతం చేసి 1.12 కోట్ల మంది మహిళలకు ఆదాయ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ బ్యాంక్ లింకేజీ ద్వారా ఇప్పటివరకు 68 వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు ఆర్థిక సహాయం అందించింది రాష్ట్రంలో ఐదు లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసింది మహిళలకే అత్యధికంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ సామాజిక భద్రతా పెన్షన్లు ప్రతినెల 32.92 లక్షల మందికి ఒక వెయ్యి 594 కోట్ల పెన్షన్ పంపిణీ జరుగుతుంది శ్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా ఇప్పటివరకు 60 కోట్ల ప్రయాణాలు నమోదయ్యాయి. తల్లికి వందనం ద్వారా 43 లక్షల మంది తల్లుల ఖాతాలో 8745 కోట్ల రూపాయలను జమ చేయడం జరిగింది దీపం మరియు దీపం 2.0 పథకాల ద్వారా మహిళల వంటింటి కష్టాలకు చేర్పెడుతూ గతంలో ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందివ్వడం జరుగుతుంది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే అదే చివరి రోజు అవుతుందని మహిళలకు భద్రత కల్పించడంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ముందుందని తెలియజేశారు వేధింపులు దాడులు అన్యాయాలపై ఎలాంటి రాజు లేకుండా చట్టం తన పని తాను చేసుకుని వెళుతుందని నమ్మం నమ్మకం కలిగించినది చంద్రబాబు నాయుడు మాత్రమేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు బి.చిన్నమ్మి, విజయ లక్ష్మి, మాలిని మొదలగు వారితో పాటు మహిళా కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

