NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బూత్ లెవల్ ఏజెంట్లే వైఎస్సార్సీపీ విజయానికి కీలక బలం : ఎమ్మెల్యే

1 min read

కూటమి ప్రభుత్వ హామీల అమలులో వైఫల్యంపై హొళగుందలో నిరసన

ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు

ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేయడమే లక్ష్యం : విరూపాక్షి

స్థానిక ఎన్నికల్లో కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ

హొళగుందలో వైఎస్సార్సీపీ బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహణ

హొళగుంద,న్యూస్ నేడు:  కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని హొళగుంద మండల కేంద్రంలో ఉన్న ఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో వైఎస్సార్సీపీ బూత్ లెవల్ ఏజెంట్లకు (BLA) శిక్షణ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు.అంతకుముందు హొళగుంద బస్టాండ్ వద్ద కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎన్నికల హామీల పత్రాలను పెట్రోల్ పోసి దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూసినే విరూపాక్షితో పాటు ఆలూరు తాలూకా వైఎస్సార్సీపీ పార్టీ పరిశీలకులు రామచంద్ర రెడ్డి పాల్గొన్నారు.అనంతరం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరియు భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ లెవల్ ఏజెంట్లదే అత్యంత కీలక పాత్ర అని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులు, బీఎల్ఏలు ఎన్నికల కమిషన్ నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.ఈ నెల జూన్ 14 నుంచి జూలై 14 వరకు ఎన్నికల కమిషన్ ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సర్వే నిర్వహించనున్న నేపథ్యంలో, పార్టీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ జాబితా నుంచి తొలగించకుండా బీఎల్ఏలు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అదే సమయంలో అర్హత కలిగిన కొత్త ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేయించేందుకు కృషి చేయాలని సూచించారు.ఓటర్ల జాబితాకు సంబంధించిన ఏవైనా అభ్యంతరాలు, సమస్యలు తలెత్తితే వెంటనే సంబంధిత బీఎల్‌ఓలకు తెలియజేయాలని సూచించారు. ఎక్కడైనా అధికార ప్రాబల్యంతో కూటమి నాయకులు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఓటర్ల పేర్లను తొలగించే ప్రయత్నం చేస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.రాబోయే జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగరేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి నాయకుడు, కార్యకర్తకు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆలూరు తాలూకా వైఎస్సార్సీపీ పార్టీ పరిశీలకులు రామచంద్ర రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కురువ శశికళ, మండల జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.కే. గిరి, మండల కన్వీనర్ షఫీ ఉల్లా, ఎంపీపీ తనయుడు ఈసా, శేషప్ప, కన్వీనర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, రాష్ట్ర, జిల్లా, తాలూకా, మండల కార్యవర్గ సభ్యులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ అనుబంధ కమిటీల సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు బీవీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *