NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాఘవేంద్రుని సన్నిధి లో రాష్ట్ర ఎస్సీ కమీషనర్ జవహర్

1 min read

మంత్రాలయం న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన  మంత్రాలయం రాఘవేంద్రస్వామి ని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమీషనర్ జవహర్  నిన్న  రాత్రి ( బుధవారం)  మంత్రాలయం కు వచ్చారు.  వీరికి మంత్రాలయం ఇన్చార్జ్ తహశీల్దార్ వేణుగోపాల్  డిప్యూటి తహశీల్దార్ శశిశేఖర్ పుష్పగుచ్చం ఇచ్చి స్వామి పలికారు.  గురువారం ఉదయం శ్రీ మఠానికి చేరుకున్న ఆయన కు మఠం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని , ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని దర్శించుకున్నారు. వీరికి పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు శేషవస్ర్తం కప్పి , ఫల మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. వారి వెంటనే  మఠం అధికారులు రాఘవేంద్ర పురానిక్ , ఎస్ఐ మల్లికార్జున , ఆర్ఐ జనార్దన్ రావు ,  తదితరులు ఉన్నారు.

About Author