NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలి

1 min read

జలవనరుల శాఖ మంత్రిని కోరిన వైకుంఠం జ్యోతి

ఆలూరు న్యూస్ నేడు: నేడు అమరావతిలోని సచివాలయంలో జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారిని ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గంలో సాగునీటి సౌకర్యాల మెరుగుదల, జలవనరుల అభివృద్ధి, రైతుల అవసరాలు, తాగునీటి సమస్యల పరిష్కారం తదితర ప్రజా సమస్యలపై మంత్రివర్యులతో విస్తృతంగా చర్చించారు. నియోజకవర్గంలోని పెండింగ్‌లో ఉన్న నీటిపారుదల పనులను వేగవంతం చేయడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన సహకారం అందించాలని కోరారు.అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు  ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు ప్రయోజనం చేకూరే అంశాలపై సానుకూలంగా స్పందిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

About Author