NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెట్రోల్ గ్యాస్ ధరలను ఉపసంహరించాలని కరపత్రాలు పంపిణీ 

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:   పెంచిన పెట్రోల్, గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని జూన్ 5న సిఐటియు ఆధ్వర్యంలో పత్తికొండ పట్టణంలోని స్థానిక నాలుగు స్తంభాల కూడలి దగ్గర జరిగే  నిరసన సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర ఆధ్వర్యంలో పత్తికొండ పట్టణంలో కరపత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోలు గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని మన రాష్ట్రంలోని కేజీ బేసిన్లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్ చమరులో 50% వాటా మనకే కేటాయించాలని జూన్ 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు రాష్ట్ర జిల్లా నాయకులు పిలుపుమేరకు నిరసన కార్యక్రమంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని అలాగే వినియోగదారులు స్వచ్ఛందంగా నాలుగు స్తంభాల కూడలి దగ్గర జరిగే నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. పత్తికొండ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క పెట్రోలు డీజిల్ గ్యాస్ వినియోగించే వినియోగదారులు ప్రభుత్వం అమాంతం గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచడంపై వారి మనసులోనే మనోవేదన పడుతున్నారని వాటిపై నిర్వహించే నిరసన కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడే  ప్రభుత్వాలకు కనువిప్పు కలుగుతుందని ప్రజల యొక్క నిరసన ఏ స్థాయిలో ఉందో అని తెలుస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం రంగస్వామి, రైతు సంఘం మండల ఉపాధ్యక్షులు రాజుల కారప్ప తదితరులు పాల్గొన్నారు.

About Author