NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉప తహసీల్దార్ చేతుల మీదుగా బూత్ స్థాయి అధికారులకు కిట్ల పంపిణీ

1 min read

జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి ఓటరు వివరాల సేకరణ

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి

హొళగుంద న్యూస్ నేడు; భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా, జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాలను సేకరించనున్న బూత్ స్థాయి అధికారులకు ఈరోజు అవసరమైన కిట్లను పంపిణీ చేశారు. ఈ కిట్లను హొళగుంద ఉప తహసీల్దార్ నిజాముద్దీన్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా ఉప తహసీల్దార్ నిజాముద్దీన్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితాను మరింత ఖచ్చితంగా రూపొందించేందుకు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో బూత్ స్థాయి అధికారుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ఇంటింటికి వెళ్లి కొత్తగా ఓటు హక్కు పొందిన వారి వివరాలను నమోదు చేయడంతో పాటు, మరణించినవారి పేర్ల తొలగింపు, ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాల సవరణ, చిరునామా మార్పుల నమోదు వంటి అంశాలను జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు.ఓటర్ల జాబితా పారదర్శకంగా, తప్పులు లేకుండా ఉండేందుకు ప్రజలు బూత్ స్థాయి అధికారులకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల శాఖ సిబ్బంది, మండల స్థాయి అధికారులు, బూత్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

About Author