NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపు

1 min read

కర్నూలు, న్యూస్  నేడు:  వైద్య విద్యలో కృత్రిమ మేధస్సు వినియోగానికి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కట్టుబడి ఉంది : వైస్ ఛాన్సలర్ డా. పి. చంద్రశేఖర్… ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలేజీలో మొక్కలు నాటిన వైస్ ఛాన్స్లర్ .. వైద్య విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపు, విద్యార్థుల్లో క్రమశిక్షణ, పరిశోధనా దృక్పథం అభివృద్ధి మరియు ఆధునిక సాంకేతికతల వినియోగానికి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని డా.  ఎన్టీఆర్  హెల్త్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా. పి. చంద్రశేఖర్ తెలిపారు.కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో అమలవుతున్న హెడ్-మెడ్ ఏఐ పైలట్ ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించేందుకు గురువారం కళాశాలను సందర్శించిన ఆయన వివిధ విభాగాల అధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదట ప్రపంచ పర్యావరణం దినోత్సవం సందర్భంగా కళాశాలలో మొక్కలు నాటారు.అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని అనుబంధ వైద్య కళాశాలల్లో త్వరలో కృత్రిమ మేధస్సు (Artificial Intelligence – AI) ఆధారిత విద్యా విధానాలను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నామని  తెలిపారు.భవిష్యత్తులో వైద్యరంగంలో ఏఐ కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు.వైద్య విద్యలో ఉన్నత ప్రమాణాలు సాధించేందుకు విశ్వవిద్యాలయం పరీక్షా విధానాన్ని మరింత పారదర్శకంగా, కఠినతరంగా రూపొందించిందని, తద్వారా సమాజానికి ప్రతిభావంతులు, నైపుణ్యాలు కలిగిన వైద్యులను అందించగలమని పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు శారీరక దృఢత్వం కొరకు ఆటలను కూడా ముఖ్యంగా ప్రోత్సహిస్తున్నామని సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా విద్యార్థులను ఎంకరేజ్ చేసేందుకు ప్రతి కాలేజీ పేర్లు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని కోరారు.కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, ఈ కళాశాల తనకు సొంత ఇంటి వంటిదని పేర్కొన్న డా. చంద్రశేఖర్, కళాశాల అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలోని రహదారుల అభివృద్ధి, ఆసుపత్రిలో మౌలిక వసతుల మెరుగుదల, వివిధ విభాగాల బలోపేతం వంటి అంశాలపై కళాశాల యాజమాన్యం వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకువచ్చింది.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఎంఈ మరియు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డా. కె. చిట్టి నరసమ్మ, అడిషనల్ డీఎంఈ మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపల్ లు డా. శ్రీరాములు, డా. రేణుకాదేవి, డా. విజయానంద్ బాబు, వివిధ విభాగాల అధిపతులు, అసోసియేట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్లు పాల్గొన్నారూ.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *