భయపెట్టే లుక్స్‌లో… రాఘవ లారెన్స్
1 min readసినిమా డెస్క్ : హారర్ మూవీస్ అంటే ఆర్జీవీ తర్వాత గుర్తొచ్చే హీరో రాఘవా లారెన్స్. హారర్‌తో పాటు కామెడీని కూడా జోడీ చేసి తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ని కూడా థియేటర్స్ రప్పించే గ్రిప్పింగ్ ఉన్న స్టోరీలను ఎన్నుకుంటాడు రాఘవ. అలా తీసిన ముని, కాంచన సీరీస్ మూవీలు సూపర్ సక్సెస్‌ని అందుకున్నాయి. ప్రస్తుతం రుద్రన్, అధిగారం అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇవి రెండూ సెట్స్‌పై ఉండగానే మరో మూవీకి అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి ‘దుర్గ’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ లుక్స్ రిలీజ్ చేశాడు. ఓ పోస్టర్లో మాంత్రికుడిలా తెల్లని గుబురు గడ్డంతో భయపెట్టిన లారెన్స్, మరో పోస్టర్లో ఒత్తైన జుట్టుతో, కన్నింగ్ స్మైల్‌తో కనిపించాడు. ఈ సినిమాని తనే నిర్మిస్తాడట కానీ డైరెక్షన్ మాత్రం తను చేయడట. త్వరలోనే దర్శకుడి పేరుని రివీల్ చేస్తానని చెప్పాడు లారెన్స్.