NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

1 min read

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి..

నందికొట్కూరు న్యూస్ నేడు: సచివాలయంలో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు  గ్రామ సచివాలయాన్ని బుధవారం మధ్యాహ్నం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.సచివాలయ సిబ్బందితో కలెక్టర్ సమావేశమై ప్రజలకు ప్రభుత్వ సేవలు పారదర్శకంగా వేగవంతంగా అందేలా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రజలకు అందుతున్న వివిధ సేవలు, సంక్షేమ కార్యక్రమాల అమలు మరియు సిబ్బంది.హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేశారు.ప్రజల అభిప్రాయాలు,రీ-సర్వే ప్రక్రియ పురోగతి,పట్టాదార్ పాస్‌బుక్‌ల పంపిణీ స్థితి వంటి అంశాలపై సిబ్బందిని అడిగారు.ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు వెంటనే పరిష్కరించాలని ప్రజల అవసరాలను గుర్తించి సేవలను సమర్థవంతంగా అందించాలని కలెక్టర్ ఆదేశించారు.ప్రజలకు సంబంధించిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి నాణ్యతతో సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.సచివాలయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నూరుల్లా,నర్సరాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author