NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి

1 min read

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై మంత్రితో చర్చ

 ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవితమ్మ హామీ

హోళగుంద న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమం, చేనేత శాఖ మంత్రివర్యులు సవితమ్మ ని ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి  మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలు, బీసీ సంక్షేమ పథకాల అమలు, చేనేత కార్మికుల సంక్షేమం, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రితో చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని వైకుంఠం జ్యోతి  మంత్రిని కోరారు.అనంతరం మంత్రి సవితమ్మ  మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బీసీ వర్గాల సంక్షేమం, చేనేత రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *