బాల్య వికాస మూల్యాంకణాలపై శిక్షణ..
1 min read
మాట్లాడుతున్న ఐసిడిఎస్ సూపర్వైజర్ సుశీల
చాగలమర్రి ( నేడు న్యూస్): బాల్య వికాస స్క్రీనింగులు, ఉపయోగించే కీలకమైన మూల్యాంకణాలపై అంగన్వాడి టీచర్లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ సుశీల శుక్రవారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల తొలి దశలోనే పర్యవేక్షించడానికి, స్థానిక ఆరోగ్య మహిళా అభివృద్ధి సంబంధిత👌 సమస్యలు, వైకల్యాలను ముందుగానే గుర్తించేందుకు అంగన్వాడి టీచర్లు తెలియ చేయాల్సిన అంశాలను స్థానిక ప్రభుత్వ వైద్యశాల వైద్యులు ప్రత్యూష, డాక్టర్ అంజలి శిక్షణ ఇస్తారన్నారు. పిల్లల అభ్యాసం మాట కదలికలు, ప్రవర్తనను పర్యవేక్షించే సర్వేలు, సాధారణంగా పుట్టినప్పటి నుండి పిల్లలపై దృష్టి ఉంచే విధానాలను తెలియజేస్తారన్నారు. స్థూల సూక్ష్మ చలన నైపుణ్యాలు, మెదడు యొక్క అనుకూలతను గరిష్ట స్థాయికి పెరిగేందుకు టీచర్లు గుర్తించే విధానాలను తెలియజేస్తారన్నారు. సంరక్షకులు శిశు వైద్యులు పిల్లల రోజువారి ప్రవర్తనను పర్యవేక్షించే విధానాలను శిక్షణలో తెలియజేస్తారని ఆమె తెలిపారు. ఈ శిక్షణకు అంగన్వాడి టీచర్లు హాజరవుతున్నట్లు తెలిపారు.

