53వ నెల సేవా కార్యక్రమం విజయవంతం
1 min read
– నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ
సేవే పరమో ధర్మం – స్వామి వివేకానంద ట్రస్ట్, భారత్ యూత్ అసోసియేషన్ సేవలు అభినందనీయం
ప్రతి నెలా నిరంతర సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్న సేవా సంస్థలు
హోళగుందన్యూస్ నేడు; స్వామి వివేకానంద ట్రస్ట్, ఆదోని మరియు భారత్ యూత్ అసోసియేషన్, హోళగుంద వారి ఆధ్వర్యంలో 53వ నెల సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనాధలు, వృద్ధులు, వికలాంగులు మరియు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేశారు.మార్లమడికి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన హోటల్ ఈరన్న – ఎర్రమ్మ దంపతులకు, అలాగే గ్రామానికి చెందిన వృద్ధురాలు రాధమ్మకు నిత్యావసర సరుకులను అందించి వారి అవసరాలను తీర్చేందుకు సహకరించారు. అదేవిధంగా గ్రామానికి సేవలందిస్తున్న గోర్క కుటుంబానికి కూడా నిత్యావసర సరుకులను అందజేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, సమాజంలో ఉన్న అర్హులైన నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులను గుర్తించి వారికి సేవా సహాయక కార్యక్రమాలు నిర్వహించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి నెలా ప్రజల సహకారంతో నిత్యావసర సరుకులను అందిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.ఈ సేవా కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలు, సేవాభావం కలిగిన యువత మరియు గ్రామస్తులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.



