NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజల విశేష స్పందనతో గ్రీవెన్స్ కార్యక్రమం విజయవంతం

1 min read

ప్రతి వినతిపత్రానికి పరిష్కారం చూపిస్తాం – వైకుంఠం జ్యోతి

ఆలూరు టిడిపి కార్యాలయంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం

నియోజకవర్గ ప్రజలకు అండగా నిలుస్తున్న వైకుంఠం జ్యోతి

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరునియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆలూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్  వైకుంఠం జ్యోతి  ఆధ్వర్యంలో ఆలూరు టిడిపి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ (ప్రజా సమస్యల పరిష్కార) కార్యక్రమం విశేష ప్రజాదరణతో విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై తమ వ్యక్తిగత, సామాజిక, మౌలిక వసతులు మరియు సంక్షేమానికి సంబంధించిన సమస్యలను నేరుగా జ్యోతి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు సమర్పించిన ప్రతి వినతిపత్రాన్ని ఆమె స్వయంగా స్వీకరించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేయడం తమ బాధ్యత అని ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి  పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆలూరు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పసుపు సైనికులకు టిడిపి నాయకత్వం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసింది.

About Author