NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బ్రాహ్మణకొట్కూర్’లో 1069 పాస్ పుస్తకాల పంపిణీ

1 min read

కూటమి రైతుల ప్రభుత్వం: ఎమ్మెల్యే..

నందికొట్కూరు న్యూస్ నేడు: రైతులకు అండగా ఉండేందుకే నూతనంగా పొలం పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.నంద్యాల జిల్లానందికొట్కూరు మండల పరిధిలోని బ్రాహ్మణకొట్కూరు లో శనివారం ఉదయం’మీ భూమి-మీహక్కు’కార్యక్రమంలో భాగంగా పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.1069 గ్రామ రైతులకు పొలం పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే రైతులకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతులను విస్మరించిందని ఎన్నో తరాలుగా సంపాదించిన రైతుల భూములకు వారి ఫోటోలు పెట్టడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. నాకూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని అన్ని విధాలుగా ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ కడియం వెంకటేశ్వర్లు యాదవ్,మండల కన్వీనర్ మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, తహసిల్దార్ బి శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి,సహకార సొసైటీ చైర్మన్ మద్దూరు హరి సర్వోత్తమ్ రెడ్డి,ఉదయ కిరణ్ రెడ్డి,ఖాజామోహిద్దిన్,ఖలీల్ బేగ్,జయకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author