పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలని సిపిఎం ధర్నా
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: పెంచిన పెట్రోలు గ్యాస్ డీజిల్ ధరలు ఉపసంహరించుకోవాలని శనివారం పత్తికొండ పట్టణంలోని స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయం నుండి నాలుగు స్తంభాల కూడలి వరకు సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి రైతు సంఘం మండల ఉపాధ్యక్షులు రాజుల కారప్ప అధ్యక్షతన వహించగా సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర మాట్లాడుతూ మనదేశంలో గ్యాస్ ఉత్పత్తిలో మన రాష్ట్రంలోని కృష్ణ గోదావరి బేసిన్ ముఖ్యమైనది కానీ మన రాష్ట్రంలో ఈ గ్యాస్ ను రిలయన్స్ కంపెనీ నేరుగా గుజరాత్కు పట్టుకుపోతుందని మన రాష్ట్రంలోని గ్యాస్ చమురులో 50% వాటా మన రాష్ట్రానికే కేటాయించాలని నిబంధనలు తెలుపుతున్న ఈ నిబంధనలు అమలు చేయకుండా మనపై మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం సమంజసం కాదు అన్నారు. ఈ నిబంధనలు అమలు అయితే మన రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ను నెలకు 200 రూపాయలకే సరఫరా చేయవచ్చని కానీ ఆ విధంగా చేయకుండా రాదా అని అంబానీల వంటి పెట్టుబడిదారుల ప్రయోజనాలకే కేంద్రం పనిచేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లాదిమంది ప్రజాస్వామ్య ప్రజానీకా కుటుంబాలకు తీవ్రమైన ద్రోహం చేస్తుందని దీనిని మన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వ్యతిరేకించడం లేదని జనసేన కూడా నోరు తెగలడం లేదని వీరి వల్ల రాష్ట్ర ప్రజానీకానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో గ్యాస్ పెట్రోల్ లో 50% వాత మనకి ఇవ్వాలని న్యాయమైన వాత కోసం ఉద్యమించాలని పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు హమాలీ కార్మికులు రైతు సంఘం నాయకులు జయ ప్రకాష్ రఘు ఉరుకుందు తదితరులు పాల్గొన్నారు.


