ఋషులు మనకందించిన జ్ఞాన భాండాగారాలు పురాణాలు
1 min read
డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తి.తి.దే.
ఖానాపూర్ లో ప్రారంభమైన తితిదే ధార్మిక కార్యక్రమాలు.
కర్నూలు, న్యూస్ నేడు: పురాణాలు కాలక్షేపానికై వచ్చిన కథల సమాహారం కాదు. ధర్మం, నీతి, ఆధ్యాత్మికత, చరిత్ర, సంస్కృతి, ప్రకృతివిజ్ఞానం వంటి అనేక అంశాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా అందించిన జ్ఞాననిధులని, ఋషులు తమ అనుభవం, తపస్సు, దూరదృష్టితో సృష్టించిన ఈ పురాణాలు భారతీయ సంస్కృతికి అమూల్యమైన వారసత్వమని,”ఋషులు మనకందించిన జ్ఞాన భాండాగారాలే పురాణాలు; అవి ధర్మం, సంస్కృతి, జీవన విలువలకు దివ్య మార్గదర్శకాలని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఆధ్వర్యంలో గూడూరు మండలం, ఖానాపూర్ గ్రామంలో వెలసిన శివాలయం నందు ధార్మిక కార్యక్రమాల ప్రారంభం సందర్బంగా వారు ప్రారంబోపన్యాసం చేశారు. తదనంతరం స్థానిక భజన మండలిచేసిన భజన కార్యక్రమం, డమాం జగగదీశ్ శ్రీమద్రామాయణంపై చేసిన ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో అర్చకులు మద్దిలేటి, యు.ఈరన్న, యు.చిన్న రాముడు, చదువులన్న, జయరాములు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.



