హోళగుందలో ‘‘కూడా’’ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు ఘన స్వాగతం
1 min read
హోళగుందన్యూస్ నేడు: మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ఆవరణలో KUDA చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు ప్రజా నాయకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఐవోసీఎల్ డీలర్, టీడీపీ తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహ్యట శేషగిరి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లును శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయంగా ఆహ్వానించారు. హోళగుంద ప్రాంత అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై నాయకులు పరస్పరం చర్చించారు.చిన్నహ్యట శేషగిరి మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. హోళగుంద ప్రాంత అభివృద్ధికి తమవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత ప్రతినిధులు, అభిమానులు, స్థానిక ప్రముఖులు పాల్గొని సోమిశెట్టి వెంకటేశ్వర్లుకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో విజయవంతంగా జరిగింది.



