అద్వాన స్థితిలో గ్రామీణ ప్రాంతాల రోడ్లు!..
1 min read
రోడ్లు దుస్థితిపై దశల వారి ఉద్యమం చేపడతాం…డివైఎఫ్ఐ
న్యూస్ నేడు, పత్తికొండ: దేవనకొండ మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల లింక్ రోడ్లు తీవ్రమైన అద్వాన పరిస్థితిలో ఉన్నాయని అయినా పాలకులకు ,అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదని వెంటనే పాడైపోయిన రోడ్లలో నూతన రోడ్ల నిర్మాణం చేపట్టాలని, అదేవిధంగా మరమ్మత్తులను చేపట్టాలని భారత ప్రజాతంత్ర యువజన సంఘం ( డివైఎఫ్ఐ )మండల అధ్యక్ష కార్యదర్శులు వై మహేంద్ర, కే శ్రీనివాసులు డిమాండ్ చేశారు. దేవనకొండ మండల కేంద్రంలో మంగళవారం నాడు వారు మాట్లాడుతూ మండలంలోని దుస్థితిలో ఉన్న ఈదుల దేవర బండ. – బేతపల్లి, కప్పట్రాళ్ల – నెల్లిబండ, కర్నూల్ బళ్లారి రోడ్డు – తెర్నేకల్ -తెన్నేకల్ – బెల్లం దొడ్డి, కరివేముల – జిల్లెడు బుడకల వెంకటాపురం బుర్రకుంట గుడిమేరాల తదితర రోడ్లు ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిందని అధికారులు చెప్తున్నారు కానీ వాటిని కొత్త రోడ్లలో వేయడం గాని మరమ్మత్తులు చేయడంలో గాని ఇప్పటివరకు ప్రారంభించలేదని అద్వానమైన రోడ్ల వలన మండల ప్రజానీకానికి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే మండలంలోని లింకు రోడ్ల నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన చర్ల చేపట్టాలని వారి డిమాండ్ చేశారు ఇప్పటికే గతంలో డివైఎఫ్ఐ గా అధికారుల దృష్టికి తెచ్చినప్పుడు చాలా తొందరలోనే రోడ్ల నిర్మాణం చేపడతామని మాటలు చెప్పారని ఆచరణలో ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని వారు పేర్కొన్నారు రోడ్ల మరమ్మతులు చేపట్టకపోతే ఆయా కార్యాలయం ముందు బైఠాయింపు చేస్తామని గ్రామీణ ప్రాంతాల యువతను సమీకరించి కార్యాలయం దిబ్బందనం కార్యక్రమం లు చేపడతామని హెచ్చరించారు.


