రేపు మున్సిపాలిటీ షాపుల వేలం పాట
1 min read
అర్బన్ హెల్త్ సెంటర్ నాణ్యతగా చేపట్టాలి..
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీకి చెందిన షాపులను రేపు అనగా 11వ తేదీ గురువారం ఉదయం 11 గంటలకు బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి మంగళవారం అన్నారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ జైకిసాన్ పార్కులో బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆసక్తి గలవారు వేలంపాటలో పాల్గొనాలని కమిషనర్ కోరారు.మంగళవారం ఉదయం పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మున్సిపాలిటీ కమిషనర్ పరిశీలించారు.ఈ ఆరోగ్య కేంద్రం నాణ్యతగా నిర్మించాలని ఈ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను కమిషనర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇన్చార్జి మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


