16 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రజలను ఆదుకుంటున్నామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. కర్నూలు నగరంలోని ఆయన కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గానికి చెందిన 16 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులు ఆయన పంపిణీ చేశారు. రామక్రిష్ణా రెడ్డి రూ.100358, మధురమణి రూ.441654, స్వప్న రూ.25541, మౌనిక రూ.51367, మాధవ క్రిష్ణ రూ.40184, పద్మశ్రీ రూ.37584, మనోహర్ రూ.52800, శ్రీనివాసరావు రూ.35000, మహమ్మద్ షబాజ్ ఖాన్ రూ.36800, మలాన్ బీ రూ.40384, చాకలి చంద్రశేఖర్ రూ.51200, సుధీర్ కుమార్ రూ.30000, ఉదయ్ కుమార్ రూ.67482, షేక్ బద్రున్నీసా రూ.41048, విజయ భాస్కర రాజు రూ.36733, బచ్చల ఉమా (బచ్చల సునీల్ కుమార్ రెడ్డి)రూ.752801ల చెక్కులు అందించారు. ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అండగా ఉంటున్నట్లు టీజీ భరత్ గుప్తా తెలిపారు. సహాయం పొందిన వారు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ మేలు చేసేవిధంగా పనిచేస్తుందన్నారు. ఇప్పటి వరకు మొత్తం 188 మందికి రూ.1,85,29,563లు అందించామన్నారు. ఈ సందర్భంగా చెక్కులు తీసుకున్న వారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, మంత్రి టీజీ భరత్ గుప్తాకు ప్రత్యేక కృతజ్నతలు తెలియజేశారు.


