జీరో హెల్తీ క్యాంపస్ లను ఏర్పాటు చేయాలి
1 min read
జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి
కర్నూలు , న్యూస్ నేడు: స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాల సాధనలో భాగంగా జిల్లాలో నెట్ జీరో హెల్తీ క్యాంపస్ల ఏర్పాటు ఈ నెల లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాల అమలుకు , నెట్ జీరో,హెల్తీ క్యాంపస్ సంబంధిత అంశాలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… అల్ట్రా హెడెన్సిటీ మొక్కలు పెంచటానికి అనుకూలంగా ఉన్న 13 విద్యా సంస్థల్లో ఈనెల 19వ తారీకు లోపు మరియు ఈ నెలాఖరులోగా జిల్లాలోని మిగిలిన 37 విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లు పర్యావరణ హిత కేంద్రాలుగా రూపుదిద్దుకోవడానికి అన్ని చర్యలు పూర్తి చేయటానికి వెంటనే తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నెట్ జీరో కార్యక్రమాల్లో భాగంగా బయో వేస్ట్, లిక్విడ్ వేస్ట్, గ్రీన్ వాటర్ నిర్వహణలో భాగంగా సోక్ పిట్లు, రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్లు,గ్రే వాటర్ పిట్ లు , కిచెన్ వేస్ట్ పిట్ లను నెల ఆఖరులోగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ పనులను ఎన్ఆర్ఈజీఎస్ పనుల ద్వారా రూరల్ లో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కర్నూలు, ఆదోని, యెమ్మిగనూరు ల లో మున్సిపల్ శాఖ ద్వారా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ” కన్హా హార్ట్ ఫుల్ నెస్ ” సంస్థ మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య నెట్ జీరో పర్యవేక్షణ కొరకు కుదిరిన ఒప్పంద పత్రాన్ని సంస్థ ప్రతినిధులు కళ్యాణ్ , వెంకటరెడ్డి , గంగాధర్ జిల్లా కలెక్టర్ కు అందజేశారు.ఈ సమావేశానికి డ్వామా పీడీ నర్సింహారెడ్డి, సోషల్ వెల్ఫేర్ అధికారి రాధిక , బీసీ వెల్ఫేర్ ప్రసూన , ట్రైబల్ వెల్ఫేర్ సురేష్ ,ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్ , కర్నూలు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేష్ , సిపిఓ భారతి , పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ కిషోర్ రెడ్డి , అడిషనల్ కమిషనర్ కృష్ణ , డిపిఓ భాస్కర్ , ఎస్ ఎస్ ఎ ఏపీసి లోకరాజు , నెట్ జీరో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ కళ్యాణ్ సెంటర్ కోఆర్డినేటర్ లు రామచంద్ర మిషన్ వెంకట్ రెడ్డి , గంగాధర్ , సంబందించిన అధికారులు , ఏపీఆర్జేసీ కోఆర్డినేటర్, పాల్గొన్నారు.


