సర్ కార్యక్రమం పై బూత్ ఇన్చార్జిలకు యూనిట్ ఇన్చార్జి లకు అవగాహన
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, డోన్ నియోజకవర్గ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి సూచన మేరకు ప్యాపిలి పట్టణం టిడిపి కార్యాలయం నందు రెండవ బుధవారం మండల స్థాయి సమావేశం నిర్వహించారు . కార్యక్రమంలో పట్టణంలో ఉన్న వివిధ సమస్యలు మరియు సర్ కార్యక్రమం పై బూత్ ఇన్చార్జిలకు యూనిట్ ఇన్చార్జి లకు అవగాహన కల్పిస్తూ సర్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలని తీర్మానం చేశారు. తెలుగుదేశం పార్టీ ముద్రించిన బిఎల్ఎ మార్గదర్శిని బుక్లెట్లను బూత్ ఇన్చార్జ్ లకు పంపిణీ చేసి వివరాలని క్లుప్తంగా వివరించారు . కార్యక్రమానికి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర డైరెక్టర్, క్లస్టర్ ఇన్చార్జిలు, యూనిట్ ఇన్చార్జులు,బూత్ ఇన్చార్జిలు, మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.



