NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు గోదావరి జలాలను తోడే మోటర్లకు పూజా

1 min read

బుధవారం నుంచి గోదావరి జలాలను ఎస్ఎస్ ట్యాంక్ లో నింపే కార్యక్రమం

నగరపాలక సంస్థ ఆప్షన్ కో- ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నగర ప్రజల సహకారంతో ఈ సంవత్సరం వేసవికాలంలో నగర ప్రజలందరికీ రెండు పూటలు శుద్ధి చేసిన మంచినీటిని అందించగలిగామని రాబోయే వేసవికాలానికి ఇబ్బంది లేకుండా బుధవారం నుంచి గోదావరి జలాలను ఎస్ఎస్ ట్యాంక్ లో నింపే కార్యక్రమం ప్రారంభించామని నగరపాలక సంస్థ ఆప్షన్ కో- ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు తెలిపారు. వేసవికాలం కారణంగా ఇరిగేషన్ అధికారులు గోదావరి కాలువ ద్వారా వచ్చే నీటిని ఏప్రిల్ నెల20 వ తేదీన ఆపేసి కాలువ మరమ్మతుల అనంతరం రెండు రోజుల క్రితం గోదావరి కాలువకు నీటిని విడుదల చేశారన్నారు.మంగళవారం సాయంత్రానికి గోదావరి కాలువ ద్వారా దెందులూరు సమీపానికి గోదావరి జలాలు చేరుకున్నాయని పెదబాబు తెలిపారు.శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాలతో కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు బుధవారం ఉదయం దెందులూరు సమీపంలో ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు గోదావరి జలాలను తోడే మోటర్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించి స్విచ్ ఆన్ చేసి గోదావరి నీటిని ఎస్ ఎస్ ట్యాంక్ లోకి నింపే ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ గత సంవత్సరం దెందులూరు సమీపంలో ఉన్న ఎస్ఎస్ ట్యాంకు లీకేజీ ఏర్పడడం,వర్షాలు సమయానికి కురవకపోవడం,గోదావరి కాలువ ద్వారా నీరు రాకపోవడం మొదలగు కారణాలతో ఈ సంవత్సరం వేసవి కాలంలో నగర ప్రజలకు రెండు పూటలు శుద్ధి చేసిన మంచినీటిని అందించడం పెద్ద సవాల్ గా మారిందన్నారు.అయితే శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య,నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఇతర ప్రజా ప్రతినిధులు  పిలుపుమేరకు నగర ప్రజలు త్రాగునీటిని వృధా చేయకుండా వినియోగించినందుకు అందరికీ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎ ఎం ఆర్ పెదబాబు కృతజ్ఞతలు తెలియజేశారు.రాబోయే వేసవికాలంలో నగర ప్రజలకు మంచినీటి ఇబ్బందులు లేకుండా అద్దె పరికరాలు అవసరం లేకుండా. వెయ్యి కిలో వాట్ కొత్త ట్రాన్స్ఫార్మర్ తో పాటు,20-15 హెచ్ పి మోటర్లు-25,షెడ్డు,పైప్ లైన్లు,మొదలగునవి కార్పొరేషన్ పరంగా పర్మినెంట్ గా సొంతంగా సమకూర్చుకోవడం జరిగిందన్నారు. ఎస్ ఎస్ ట్యాంక్ పై చుట్టూ మొక్కలను శాశ్వతంగా తొలగించడం జరిగిందన్నారు. శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య,నూర్జహాన్ పెదబాబు ఆదేశాలతో రాబోయే వేసవికాలంలో నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 25 రిజర్వాయర్లకు 65 వేల కులాయి కనెక్షన్లకు రెండు పూటలా శుద్ధి చేసిన మంచి నీటిని అందించడానికి ఇప్పటి నుండే ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని కో-ఆప్షన్ సభ్యులు ఎస్ ఎం ఆర్ పెదబాబు తెలిపారు. పెదబాబు వెంట మున్సిపల్ ఎంఈ. సురేంద్రబాబు,ఎలక్ట్రికల్ డిఈ నారాయణరావు,ఏ.ఈ సాయి,పవన్, కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహారావు, బత్తిన విజయ్ కుమార్, దేవరకొండ శ్రీనివాసరావు,పాము శామ్యూల్ తదితరులు ఉన్నారు.

About Author