NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్

1 min read

నిర్మాణాలు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలి

మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామిరెడ్డి..

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను  బుధవారం నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ జి వెంకటరామిరెడ్డి పరిశీలించి నిర్మాణాలు జరుగుతున్న భవనాలు నాణ్యతగా ఉండాలని కాంట్రాక్టర్లను కమిషనర్ ఆదేశించారు.ఆత్మకూరు రోడ్డులో షాదీఖానా కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు మరియు పట్టణ ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులు నాణ్యతగా ఉండాలని అదేవిధంగా నిర్ణీత గడువులోపు భవనాలు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను కమిషనర్ ఆదేశించారు.కాలేజీ రోడ్డులోని పెద్ద డ్రైనేజీని పరిశీలించి డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగించి మురుగు నీరు సజావుగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.సమ్మర్ స్టోరేజ్ ని పరిశీలించి అధికారులకు తగు సూచనలు తెలియజేశారు. తర్వాత కాలనీ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ బి.దినేష్ కుమార్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author