రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలి
1 min read
నకిలీ విత్తనాలు అరికట్టాలి
ఏడీఏ గిరీష్ కు సీపీఐ (ఎంఎల్)పార్టీ వినతి..
నందికొట్కూరు న్యూస్ నేడు: రైతులకు ప్రభుత్వ సబ్సిడీపై విత్తనాలను ఇవ్వాలని సీపీఐ (ఎంఎల్)లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో వ్యవసాయ కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో వ్యవసాయ సహాయ సంచాలకులు గిరీష్ మరియు మండల వ్యవసాయ అధికారి పి షేక్షావలికి బుధవారం వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు 2026 సంవత్సరం సీజన్ లో 50 శాతం సబ్సిడీపై విత్తనాలు మొక్కజొన్న,వరి,మినుము,పెసర,కoది,సోయాబీన్ తదితర పంట విత్తనాలను సబ్సిడీపై ఇవ్వాలని అన్నారు.రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పై అధికారులతో మాట్లాడి సబ్సిడీపై విత్తనాలు వచ్చే విధంగా కృషి చేస్తామని వ్యవసాయ అధికారులు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.ఖరీఫ్ సీజన్-2026 సంవత్సరంకు సంబంధించి జూన్ మొదటి వారంలో రైతులకు వర్షాలు కురవడంతో విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారని విత్తనాలను ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలు ప్రైవేట్ వ్యాపారస్తుల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని ఎరువుల ధరలు తగ్గించాలి నకిలీ విత్తనాలు అరికట్టాలి. ఖరీఫ్ సీజన్ లో బ్యాంకుల ద్వారా పంటతో నిమిత్తం లేకుండా ఎకరాకు 3 లక్షల రూ.లు సున్నా వడ్డీ కింద రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు టి.నరసింహులు,వేల్పుల ఏసన్న,కృష్ణయ్య,వడ్డే శ్రీరాములు,మహ్మద్ భాష పాల్గొన్నారు.


