స్వచ్ఛ పథం కార్యక్రమంలో హోళగుందలో శుభ్రత పనులు
1 min read
– పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో
హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండల కేంద్రంలో స్వచ్ఛ పథం కార్యక్రమంలో భాగంగా పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన రహదారులు, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాలు మరియు ప్రజా ప్రదేశాలలో ప్రత్యేక శుభ్రత పనులు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని రాజశేఖర్ గౌడ్ తెలిపారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలని, చెత్తను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని సూచించారు. పంచాయతీ సిబ్బందితో కలిసి రోడ్లు, కాలువలు, ప్రజా ప్రదేశాలను శుభ్రపరిచి పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపట్టారు.గ్రామాభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణకు పరిశుభ్రత ఎంతో అవసరమని పేర్కొంటూ, స్వచ్ఛమైన హోళగుంద నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.


