సర్ మండల స్థాయి శిక్షణా తరగతుల్లో టిడిపి నాయకులు
1 min read
కార్యకర్తల ఉత్సాహభరిత పాల్గొనిక
పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణంపై సమగ్ర అవగాహన
హోలగుందన్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు హోలగుంద గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన సర్ మండల స్థాయి శిక్షణా తరగతులు విజయవంతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు కీలక అంశాలపై మార్గనిర్దేశం చేశారు.శిక్షణా కార్యక్రమంలో పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణం, గ్రామ స్థాయి కమిటీల బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం, సోషల్ మీడియా వినియోగం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణతో వ్యవహరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ఈ తరగతులు కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని, స్పష్టమైన కార్యాచరణ దిశను అందించాయని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో తెలుగు యువత మాజీ రాష్ట్ర కార్యదర్శి చిన్నహట్ట శేషగిరి, తెలుగుదేశం పార్టీ కన్వీనర్ తిప్పయ్య, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పంపావతి, టిడిపి నాయకులు రాజా పంపనగౌడ్, రైస్ మిల్ మురళి, సీనియర్ నాయకులు దుర్గయ్య, ఎర్రిస్వామి, గజ్జహళ్లి బాబు, టిడిపి మండల అధ్యక్షుడు ముల్లా మొయిన్, హేబ్బటం విష్ణువర్ధన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకావడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


