NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దళిత పేటకు త్రాగునీరు మౌలిక సదుపాయాలు అందించండి.. బీఎస్పీడిమాండ్

1 min read

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా న్యూస్​ నేడు  : ఉప్పలగుప్తం మండలం లోని  భీమనపల్లి గ్రామపంచాయతీ 14 వార్డు చివారు ప్రాంతమైన దళిత పేటకు 30 కుటుంబాలు సుమారు 180 మంది నివసిస్తున్నారు. కానీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత త్రాగునీరు మాత్రం సరిగ్గా అందడం లేదని. ఊరికి చివరన ఉండుటవలన ఇంటింటికి కొళాయి వేయలేదని. పెత్తందారులకు అగ్రవర్ణాలకు ఇళ్లకు మాత్రం ముందుగా ఇంటింటికీ కొళాయి వేశారని. ఊరికి చివరగా ఉన్న దళిత పేటకు మాత్రం ఇంటింటికి కులాయి వేయడంలో పంచాయతీ అధికారులు మండల స్థాయి అధికారులు దళిత పేట పైన దళితులు పైన వివక్ష చూపుతున్నారని. బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీఅమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ పొలమూరి మోహన్ బాబు తెలుసుకొని క్షేత్రస్థాయి పరిశీలన చేయగా ఆ చివర ప్రాంతం  కిత్తనచెరువు  పాతాళ దిబ్బ కుదగ్గరగాను భీమనపల్లి పంచాయితీకి దూరంగా ఉండుటవలన… రెండు పంచాయితీలు ఇది మీది అంటే ఇది మీది అంటూ… వాదోపవాదాలు వేసుకుంటూ.. దళిత పేటకు ఇంటింటికి మంచినీటి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత నుండి తప్పుకుంటూ వివక్ష చూపుతున్నారని వాస్తవంగా భీమనపల్లి 14 వార్డ్ గ్రామపంచాయతీకి చెందిన వార అయినప్పటికీ భీమనపల్లి గ్రామపంచాయతీ అధికారులు. మండల అభివృద్ధి అధికారి వారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులునిర్లక్ష్యం వహిస్తున్నారని తక్షణమే స్పందించి దళిత పేటకుఇంటింటికి  కొళాయి వేయాలని  అధికారులను డిమాండ్ చేశారు.

About Author