NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫిర్యాదుల పరిష్కారంలో వేగం పెంచాలి

1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు

ఫిర్యాదుల స్వీకరణ’కు 19 అర్జీలు

కర్నూలు, న్యూస్​ నేడు:  సోమవారం ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో మరింత వేగవంతం పెంచాలని, నిర్దేశిత గడువు చివరి వరకు వేచి ఉండొద్దని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు. సోమవారం స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ కాలనీలకు చెందిన ప్రజల నుండి 19 ఫిర్యాదులు వచ్చాయి. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీనిచ్చారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ఎస్ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, ఇంచార్జీ సిటి ప్లానర్ వెంకటరమణ, మేనేజర్, ఆర్వో జూనైద్, ఎంఈ మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *