మంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటీడీపీ జిల్లా అధ్యక్షులు గట్టు తిలక్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ జిల్లా అధ్యక్షులు గట్టు తిలక్ ఈరోజు రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి శ్రీ నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి కర్నూలు జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు .ఈ సందర్భంగా జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల విస్తరణ, పరిశ్రమల ఏర్పాటు, విద్యా రంగ బలోపేతం, రహదారులు మరియు ఇతర ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా చర్చించారు, కర్నూలు జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ వినతిపత్రాన్ని నారా లోకేష్ కి అందజేశారు .అదేవిధంగా, ప్రతిపక్షంలో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎలాంటి వ్యక్తిగత ఆశలు లేకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విధానాలపై పార్టీ తరఫున నిరంతరం పోరాడిన ఐటీడీపీ సభ్యులకు పార్టీ పరంగా తగిన గుర్తింపు, ప్రోత్సాహం మరియు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లి నారా లోకేష్ గని విజ్ఞప్తి చేయగా, శ్రీ నారా లోకేష్ సానుకూలంగా స్పందించి సంబంధిత అంశాలను పరిశీలిస్తామని తెలిపారు.కర్నూలు జిల్లా అభివృద్ధి, పార్టీ బలోపేతం మరియు కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యలను, పార్టీ శ్రేణుల అభిప్రాయాలను ప్రభుత్వ మరియు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తూ ఐటీడీపీ తరపున కృషి చేస్తానని లోకేష్ కి తెలియ చేశారు .

