PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విలన్‌ అంటే ఇతనే

1 min read

సినిమా డెస్క్​ : డబ్బింగ్‌ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ఫహాద్‌ ఫాజిల్‌ తొలిసారిగా ఓ తెలుగు చిత్రంలో నటించబోతున్నాడు. ‘పుష్ప’లో విలన్‌గా మారి అల్లు అర్జున్‌ను ఢీకొట్టబోతున్నాడు. దీంతో పాటు కమల్‌ హాసన్‌, విజయ్‌సేతుపతితో కలిసి ‘విక్రమ్‌’లోనూ నటించే ఛాన్స్‌ కొట్టేశాడు. వెర్సటైల్ నటుడు కాబట్టే ‘పుష్ప’ రాజ్‌కి తగిన విలన్‌గా సుకుమార్‌‌ కూడా ఇతన్ని ఎంచుకున్నాడు. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్‌‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతూ ఉండటంతో ఈ మూవీపై భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. అవి కాస్తా ఫహాద్‌ రాకతో మరింత పెరిగాయి. నిన్న ఫహాద్ పుట్టినరోజు కావడంతో ఓ పోస్టర్‌‌ను కూడా రిలీజ్ చేస్తూ స్పెషల్‌గా విష్ చేసింది టీమ్‌. ఇందులో ఫహాద్ కన్ను మాత్రమే కనిపిస్తోంది. ‘ఈవిల్ వజ్ నెవర్ సో డేంజరస్‌’ అని ఇంగ్లిష్‌ రాసి ఉంది. దాని అర్థం చెడు ఎప్పుడూ అంత ప్రమాదకరమైనది కాదు అని. అంటే అతను మరీ అంత చెడ్డవాడు కాదు అని అనుకోవాలేమో మరి. కానీ సినిమాలో ఎలా కనింపించనున్నాడో ఫహాద్‌. రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్‌ ఘోష్, అనసూయ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. క్రిస్మస్‌కి మొదటి పార్ట్ రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే కమల్ హాసన్‌ ‘విక్రమ్‌’లోనూ విలన్‌గా నటిస్తున్నాడు ఫహాద్. ఆ టీమ్‌ కూడా ఓ పోస్టర్‌‌తో తనకి విషెస్ చెప్పింది. మొత్తానికి స్టార్‌‌ హీరోలందరూ ఫహాదే విలన్‌గా కావాలని కోరుకోవడం విశేషం.

About Author