గుండెపోటుతో వెలుగు వివో ఏ హఠాన్మరణం
1 min read
4 సం.ల క్రితం తమ్ముడు అనారోగ్యంతో మృతి..
తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు..
మిడుతూరు(నందికొట్కూరు) న్యూస్ నేడు: గుండెపోటుతో యువకుడు వెలుగు వివోఏ హఠాన్మరణం చెందిన సంఘటన నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రంలో చేదు ఘటన చోటుచేసుకుంది.మిడుతూరు గ్రామ స్థానికులు మరియు వెలుగు కార్యాలయ సిబ్బంది తెలిపిన వివరాలు మేరకు మిడుతూరు గ్రామానికి చెందిన ఏసన్న,మరియమ్మ కుమారుడు ఎస్.చెన్నయ్య(38) గుండెపోటుతో మృతి చెందారు.శుక్రవారం ఉదయం వరకు బాగానే ఉన్నా చెన్నయ్య ఉదయం టిఫిన్ చేశాక స్నేహితులతో కలిసి బయటికి వెళ్లారు. గుండెనొప్పి ఉందని చెప్పిన చెన్నయ్య అక్కడే కుప్పకులాడు.వెంటనే స్నేహితులు స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు.వెలుగు కార్యాలయ సిబ్బందితో అక్కడ బాగానే మాట్లాడిన చెన్నయ్య కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలిస్తుండగా మధ్యాహ్నం 12:30 సమయంలో మార్గమధ్యలో మరణించాడు.చెన్నయ్య 10 సంవత్సరాల నుండి గ్రామంలో పొదుపు లక్ష్మి వివో ఏ బుక్ కీపర్ గా పనిచేస్తున్నాడు.ఏడు సంవత్సరాల క్రితం వివాహం కాగా భార్య విడాకులు ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు.తల్లిదండ్రులకు ఇద్దరు కుమారులు ఉండగా చెన్నయ్య తమ్ముడు రాజు అనారోగ్యంతో గత 4 సం.ల క్రితం మరణించాడు.ఇద్దరు కుమారులు మృతి చెందడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

