స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్న భక్తులు
1 min read
ఏపీ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ట్ సుబెందు సమంత దంపతులురాక
వివిధ సేవల రూపేణా రూ.2,04,686/-లు ఆదాయం సమకూరినది
నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 2224 మంది భక్తులకు అన్నదానం
అసిస్టెంట్ కమీషనర్, కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఈ రోజు శనివారం సందర్భముగా ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దేవస్థానము నందు ఉదయం గం.08.00ల నుండి ఆలయ ప్రాకార మండపం నందు పంచామృతఅభిషేకం ఆలయ అర్చకులు, వేద పండితులు, ఆద్వర్యములో జరుపబడినది. ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనినారు. శనివారం మద్యాహ్నం గం.03.30 ని లవరకు శ్రీ స్వామి వారి ఆలయమునకు వివిధ సేవల రూపేణా రూ.2,04,686/- లు సమకూరినది. శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 2224 మంది భక్తులకు అన్నదానము జరుపబడినది. శ్రీ స్వామి వారి దర్శనమునకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ ధర్మ కర్తల మండలి అద్యక్షులు శ్రీ రాజాన సత్యనారాయణ మరియు ఆలయ అసిస్టెంట్ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెల్పినారు. శ్రీ స్వామి వారి దర్శనార్ధమై ఈ రోజు ఆంద్రప్రదేశ్ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ట్ సుబెందు సమంత దంపతులు విచ్చేసియున్నారు, వీరికి దేవస్థానం అర్చకులు, వేద పండితులు మరియు అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికిన అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించియున్నరు. అనంతరం వేద పండితులనుండి వేద ఆశీర్వచనం చేసియున్నారు. వీరికి శ్రీ స్వామి వారి తీర్ధ ప్రసాదలను దేవస్థానం ఛైర్మన్ శ్రీ రాజన సత్యనారాయణ మరియు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారిని ఆర్.వి.చందన అందజేసియున్నారు.

