NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే

1 min read

న్యూస్ నేడు,పత్తికొండ:   రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని పత్తికొండ శాసనసభ్యులు కేజే శ్యాం కుమార్ అన్నారు. పత్తికొండ నియోజకవర్గం లోని క్రిష్ణగిరి మండలం తొగర్చేడు గ్రామంలో శనివారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2006 2007 తొలి విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పత్తికొండ నియోజకవర్గంలో 54,774 మంది రైతులకు రూ.36.84 కోట్ల అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ తొలి విడత ఆర్థిక సాయం అందిందని ఆయన తెలిపారు.రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందన్నారు.పత్తికొండ నియోజకవర్గ వ్యాప్తంగా 54,774 మంది రైతుల ఖాతాల్లో తొలి విడతగా రూ.36.84 కోట్ల ఆర్థిక సాయం జమ కావడం రైతుల పట్ల కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, సాగు ఖర్చులు తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది అని పేర్కొన్న ఎమ్మెల్యే , ప్రతి రైతు కుటుంబానికి అండగా నిలిచి వారి ఆర్థిక పురోగతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *