NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్‌డీపీఐ 18వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

1 min read

హోళగుందన్యూస్ నేడు: సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) 18వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆలూరు అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి ఎన్. సుబాన్, ఆలూరు నియోజకవర్గ అధ్యక్షులు హమీద్ హాజరై పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 18 సంవత్సరాలుగా ఎస్‌డీపీఐ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, సమానత్వం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం నిరంతరంగా పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.రాష్ట్ర కార్యదర్శి ఎన్. సుబాన్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ ప్రధాన ధ్యేయమని, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం ఎస్‌డీపీఐ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు. యువత రాజకీయ చైతన్యంతో ముందుకు వచ్చి సామాజిక మార్పు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.అలాగే దేశంలో రాజ్యాంగబద్ధ హక్కులు, లౌకికవాదం, సామాజిక సమానత్వాన్ని కాపాడటంలో ఎస్‌డీపీఐ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలపై ఉద్యమాలు, సేవా కార్యక్రమాలు, హక్కుల సాధన కోసం పార్టీ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న కార్యకర్తలను నాయకులు అభినందించారు. గ్రామ, మండల స్థాయిలో పార్టీని మరింత విస్తరించి ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరిన్ని ఉద్యమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షులు కే. సలాం, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్, కార్యదర్శి ఆఫీస్, కోశాధికారి అల్లాబక్ష్, నాయకులు అస్లాం, షఫీ, హరూన్ తదితరులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.”సామాజిక న్యాయం – రాజ్యాంగ పరిరక్షణ – ప్రజా హక్కుల సాధనే ఎస్‌డీపీఐ లక్ష్యం” అనే నినాదాలతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *