గత కొంతకాలంగా అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ
1 min read
సిరివాక పరిసర ప్రాంతాలలో ఉన్నట్లు అటవీ శాఖాధికారులు గుర్తింపు
ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు
జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గత కొంతకాలంగా అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉన్న పులి, తాజాగా నది దాటి పోలవరం జిల్లా నుండి ఏలూరు జిల్లా పరిధిలోకి ప్రవేశించిందని. ప్రస్తుతం ఇది సిరివాక పరిసర ప్రాంతాలలో ఉన్నట్లు అటవీ శాఖాధికారులు అధికారులు గుర్తించారని జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ రెడ్డి చెప్పారు. ప్రస్తుతం అటవీ శాఖకి చెందిన అధికారులు, సిబ్బంది అందరూ కొరుటూరు ప్రాంతంలోనే రాత్రి బస చేసి పరిస్థితిని నిరంతరం గమనిస్తున్నారన్నారు. పులిని పట్టుకోవడానికి వీలుగా నదీ తీరం వెంబడి (రివర్ బ్యాంకు) వేర్వేరు టీమ్లను ఏర్పాటు చేసి, అవసరమైన బోన్లు (కాజ్), లాజిస్టిక్స్ మరియు వెటర్నరీ బృందాలను సిద్ధంగా ఉంచడం జరిగింది. పులి సమీప ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందా, దాన్ని ట్రాంక్విలైజ్ (ట్రానక్విలిజ్) చేసేందుకు ఉన్న అవకాశాలపై వారు శ్రమిస్తున్నారన్నారు. పులి సంచరిస్తున్న ప్రాంతంలో జనవాసాలు ఏవీ లేవని ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ప్రస్తుతం అది పాపికొండలు నేషనల్ పార్క్ పరిధిలోనే ఉంది కాబట్టి ప్రజలు ఆందోళన చెందకూడదని అధికారులు స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి (డిప్యూటీ సీఎం) ఆదేశాల మేరకు, మరియు అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం జిల్లా స్థాయిలో అలాగే మండల స్థాయిలో యంత్రాంగం అంతా చాలా అప్రమత్తంగా ఉన్నారన్నారు. గ్రామస్తులు ఎవరూ కూడా అక్రమంగా నది పరివాహక ప్రాంతాలలో చేపల వేటకు (ఫిషింగ్) గానీ, పశువుల మేతకు (గ్రాజింగ్) గానీ వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు.అన్ని శాఖల అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసి అటవీ శాఖ సిబ్బంది నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా, పేరంటపల్లి శివాలయం వరకు టూరిజం కార్యకలాపాలను ఒక మూడు రోజుల పాటు నియంత్రణలో ఉంచాల్సిందిగా జిల్లా అటవీ శాఖాధికారి నుండి టూరిజం డిపార్ట్మెంట్కు లేఖ పంపడం జరిగిందన్నారు.


