NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

8984 పుస్తకాలు ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయం నకు  కలెక్టర్,జెసికి  అందజేత

1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: హైదరాబాద్ కు చెందిన  ఎమెస్కో బుక్స్ ప్రయివేట్ లిమిటెడ్,యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరు లు అందించిన 8984 పుస్తకాలను సోమవారం పిజిఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె.అభిషేక్ గౌడ చేతుల మీదుగా   ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయసంస్థ, ఏలూరు జిల్లా కేంద్ర గ్రంథాలయం నకు అందించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లా గ్రంధాలయ సంస్థ ఆద్వర్యంలోని 74 శాఖ  గ్రంథాలయాలకు పంపిణీ చేసి, ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.  ఎమెస్కో బుక్స్ ప్రయివేట్ లిమిటెడ్, హైదరాబాద్ వారి నుండి 8786,  యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరు వారు 198 పుస్తకాలు అందించారన్నారు.  ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు జిల్లా కేంద్ర గ్రంథాలయం భవన స్థితిగతులు. మరియు భవనo శిథిలావస్థలో ఉన్నందున తాత్కాలిక భవన వసతుల ఏర్పాటును జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.   కార్యక్రమంలో  ఈ కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఏలూరు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న,  జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి,ఎం శేఖర్ బాబు, గ్రందాయాల సిబ్బంది నారాయణరావు,ఎల్ వెంకటేశ్వరరావు,లైబ్రేరియన్స్ దుగ్గిపోగు జానుబాబు, కార్యాలయం సిబ్బంది, మరియు జిల్లా కేంద్ర గ్రంథాలయం సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

About Author