అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ర్యాలీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎం సుధీర్ బాబు మరియు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ నుండి కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది. అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవ సందర్భంగా మాదగద్రవ్యాలవాడకము, వినియోగము, రవాణా చట్టరీత్యా నేరమని తెలిపి ఆ తదుపరి నినాదాల ద్వారా కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ నిర్వహిస్తూ ప్రతి ఒకరు సే నో టు డ్రగ్,ఎస్ టు లైఫ్ (SAY NO TO DRUG, YES TO LIFE) అంటూ నినాదాలు ద్వారా సమాజంపై డ్రగ్స్ ఎలా ప్రభావం చూపేది అది మనిషి పై ఎలాంటి ప్రభావము ఉంటుంది అన్నది తెలియజేస్తూ కొండారెడ్డి బురుజు వద్ద ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఈ అవగాహన కార్యక్రమంలో డ్రగ్స్ జీవితాలను నాశనం చేస్తుందని మనిషి యొక్క ఉనికికే ప్రశ్నార్థకంగా మారుతుందని డ్రగ్స్ సేవించడం వల్ల పూర్తిగా అవయవాలు ఒక్కొక్కటిగా దెబ్బతిని మనిషి పూర్తిగా కోలుకోలేని స్థితికి వస్తారని తద్వారా కుటుంబం జిల్లా రాష్ట్రము మరియు దేశానికి నష్టం వాటిల్లే ప్రభావం ఉంటుందని వాటి జోలికి పోరాదని సభాముఖంగా అందరు వక్తలు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎం సుధీర్ బాబు ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి రాజశేఖర్ గౌడ్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ చంద్రహాస్, రాజేంద్రప్రసాద్, జయరాం నాయుడు, కిషోర్ మరియు ఎస్ఐలు దుర్గా నవీన్ బాబు, రెహానా, వెంకటరాజు, రవితేజ, మారుతి ప్రసాద్ మరియు సిబ్బంది తో పాటు ఈగల్ టీం సభ్యులు రమేష్ మొదలగు వారు పాల్గొన్నారు.

