మాదకద్రవ్యాలకు ‘నో’ చెప్పండి – ఆరోగ్యకరమైన జీవితానికి ‘అవును’ చెప్పండి
1 min read
– సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్
కర్నూలు, న్యూస్ నేడు: అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్బంగా, సి. బెళగల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల లో జిల్లా యువజన సంక్షేమ శాఖ – సెట్కూరు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడమైనది.ఈ సందర్బంగా సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణుగోపాల్ మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వ్యక్తిని మాత్రమే కాదు, కుటుంబాన్ని, సమాజాన్ని, దేశ భవిష్యత్తును కూడా నాశనం చేస్తాయి అని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఇతరులను కూడా వాటి బారిన పడకుండా చైతన్యం కల్పించాలి అని పిలుపునిచ్చారు.ఆరోగ్యవంతమైన యువతే దేశానికి నిజమైన సంపద. ప్రస్తుత యువతకు టీనేజ్ లో స్నేహితులు మగతనం అంటే సిగరెట్లు తాగడం, బీరు తాగడం అని ఇగోని రెచ్చగొడుతుంటారని, అటువంటి రెచ్చగొట్టే మాటలకూ లొంగకుండా మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటేనే ఆరోగ్యకరమైన, అభివృద్ధి చెందిన సమాజాన్ని నిర్మించగలమన్నారు.డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, కావున వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం మనం దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలలో ఒకటైన మడకద్రవ్యల వినియోగం ని అరికట్టి మాదక ద్రవ్య రహిత సమాజం ఏర్పాటు కు యువత కృషి చేయాలని తెలిపారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ యువతపై పర్యవేక్షణ ఉంచి వారు డ్రగ్స్ బారిన పడకుండా చూడాలని కోరారు.మాదకద్రవ్యాలకు ‘నో’ చెప్పండి – ఆరోగ్యకరమైన జీవితానికి ‘అవును’ చెప్పండి అని విద్యార్థులకు తెలిపారు.తదుపరి సి.బెళగల్ ASI నాగయ్య మాట్లాడుతూ డ్రగ్స్ విక్రయాలు లేదా వినియోగం జరుగుతున్నట్లు అనుమానస్పద దృష్యాలు మీకు కనిపిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ చింతలయ్య మాట్లాడుతూ చదువుకొనే వయసులో చెడు స్నేహల వల్ల సిగరెట్లు, బీరు మొదలగు వాటి తో మొదలై మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారని కావున విద్యార్థులు చెడు స్నేహల జోలికి వెళ్లకుండా చదువు పై ద్రుష్టి పెట్టి మంచి మార్కులు సాధించి తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కు, పుట్టిన ఊరుకు మంచిపేరు తేవాలని కోరారు.

