NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బళ్లారిలో ఘనంగా స్వస్తిక్ ఇన్‌ఫ్రా నూతన కార్యాలయ ప్రారంభోత్సవం

1 min read

ఆలూరు న్యూస్ నేడు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కురువ శశికళ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో స్వస్తిక్ ఇన్‌ఫ్రా (SWASTIK INFRA) నూతన కార్యాలయాన్ని బళ్లారిలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా కురువ శశికళ కృష్ణమోహన్ మాట్లాడుతూ, ప్రజలకు నమ్మకమైన రియల్ ఎస్టేట్ సేవలను అందించడమే స్వస్తిక్ ఇన్‌ఫ్రా ప్రధాన లక్ష్యమని తెలిపారు. నమ్మకం, నాణ్యత, పారదర్శకత అనే విలువలను పాటిస్తూ నివాస ప్లాట్లు, ఫార్మ్‌ల్యాండ్ ప్లాట్లు మరియు ఇతర రియల్ ఎస్టేట్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.భవిష్యత్ తరాలకు విలువైన ఆస్తులను అందించే దిశగా స్వస్తిక్ ఇన్‌ఫ్రా పనిచేస్తుందని, వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే తమ సంస్థ ధ్యేయమని అన్నారు.కార్యక్రమానికి హాజరైన అతిథులు నూతన కార్యాలయాన్ని సందర్శించి నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం అతిథులకు సన్మానం నిర్వహించి మిఠాయిలు పంచి ప్రారంభోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ముగించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *