NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉమ్మడి జిల్లాల కోర్టు ప్రాంగణంలలో నేడు జాతీయ లోక్ అదాలత్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: జాతీయ లోక్ అదాలత్ ను పురస్కరించుకొని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి, గత  కొన్ని రోజులుగా సన్నద్ధ చర్యలు చేపట్టారు. ఉమ్మడి జిల్లాలోని న్యాయమూర్తులతో ప్రత్యక్షంగా,వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై కేసుల పరిష్కారం పై దిశా నిర్దేశం  చేశారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు చెందిన న్యాయమూర్తులు సైతం పలుమార్లు స్థానిక పోలీసు అధికారులు, న్యాయవాదులు, బ్యాంక్ అధికారులు,వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహించి కేసుల పరిష్కారంలో అనుసరించాల్సిన విధానాలను వివరించారు. గత కొన్ని రోజులుగా ప్రీ లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసులను పరిష్కరించారు.ఈ ఏడాది మార్చిలో జరిగిన మొదటి లోక్ అదాలత్ లో 40049 కేసులను పరిష్కరించామని జిల్లా జడ్జి  తెలిపారు. 11 జులై శనివారం జరిగే జాతీయ లోక్ అదాలత్ లో కక్షి దారులు కేసుల పరిష్కరించుకునేందుకు వీలుగా ఉమ్మడి జిల్లాలలో 31 బెంచీలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ అవకాశమును కక్షిదారులు అందరూ ఉపయోగించుకొని , తమ తమ కేసులను రాజీ పూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *