మూడు రోజుల పాటు హెటెక్స్ లో దీప్ మేళా
1 min read
ఈనెల 31న ప్రారంభం
పోస్టర్ విడుదల చేసిన క్లబ్ సభ్యులు
దేశ నలుమూలల నుండి రానున్న సహాజ ఉత్పత్తులు
హైదరాబాద్, న్యూస్ నేడు: మూడు రోజుల పాటు హైటెక్స్ దీప్ మేళా జరగనుందని వివరాలు వెల్లడించారు దీప్ శిఖ మహిళ క్లబ్ సభ్యులు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను అమీర్ పేటలోపి కన్యా గరుకుల పాఠశాలలో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దీప్‌శిఖ మహిళా క్లబ్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి సంగీత జైన్ మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన దీప్‌శిఖ మహిళా సేవా సంస్థ. 62 సంవత్సరాల చరిత్ర కలిగినది. ఈ క్లబ్ ద్వారా నిరుపేద మహిళలకు మద్దతు అందించడంతో పాటు, నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంలో అంకితభావంతో పనిచేస్తోందన్నారు. వారి ఆర్థికసాయం కోసం ప్రతీ సంవత్సరం దీప్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మేళా ద్వారా వచ్చిన ఫండ్స్ ని స్కూల్ నిర్వహణ కోసం, మహిళా అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం జూలై 31 నుండి ఆగస్టు 2వ వరకు హెటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ హాల్-3లో ఈ మేళా జరగునందని తెలిపారు. ఈ మేళాలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి చేనేత వస్తువులతో పాటు అన్ని రకాల ఉత్పత్తులు కొలవుదీరుతాయన్నారు. ఇందులో ఎలైట్ నగలు, డిజైనర్ దుస్తులు, హస్తకళలు, లైఫ్‌స్టైల్ వస్తువులు, గిఫ్ట్ ప్లాటర్లు, న్యూట్రిషనల్ ఉత్పత్తులు, గృహోపకరణాలు, స్కిన్‌కేర్ మరియు ప్రత్యేక రాఖీలు ప్రత్యేకంగా నిలుస్తాయన్నారు. వీటితో పాటు రకరకాల రుచికరమైన ఆహార స్టాళ్లు కూడా ఉంటాయి. ఈ సంవత్సరం భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి 200కి పైగా స్టాళ్లు పాల్గొననున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు శ్రీమతి సంగీత జైన్, ఉపాధ్యక్షురాలు – శ్రీమతి భావ్నా సంఘి, కార్యదర్శి శ్రీమతి మీనాక్షి భోరారియా, కోశాధికారి శ్రీమతి శివాని తిబ్రేవాల్, సంయుక్త కార్యదర్శి శ్రీమతి మమతా భండారి, మేళా కమిటీ సభ్యులు శ్రీమతి పద్మ సుల్తానియా, శ్రీమతి శోభా బన్సల్, శ్రీమతి అనితా గోయల్, శ్రీమతి బబితా ఝబక్, శ్రీమతి విమలా బద్రుక, శ్రీమతి ప్రియాంక సురానా
దీప్ మేళా వేదిక వివరాలు:
వేదిక: హాల్ నెం. 3, హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, కొండాపూర్, హైదరాబాద్
తేదీ: శుక్రవారం, జూలై 31 నుండి ఆగస్టు 2, 2026 సమయం: ఉదయం 10:00 నుండి రాత్రి 8:00 వరకు.


