NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎల్‌ఎల్‌సీ కాలువకు తాగునీటి విడుదల ప్రారంభం

1 min read

కర్నూలు, బళ్లారి జిల్లాల ప్రజలకు ఊరట

కర్నూల్ న్యూస్ నేడు: తుంగభద్ర జలాశయం నుంచి ఎల్‌ఎల్‌సీ (లో లెవల్ కెనాల్) కాలువకు తాగునీటి అవసరాల నిమిత్తం గురువారం ఉదయం 9.30 గంటలకు నీటి విడుదల ప్రారంభమైనట్లు తుంగభద్ర రైతు సంఘం నాయకుడు  పురుషోత్తమ గౌడ్ తెలిపారు.కర్నూలు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం 1.50 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి అనుమతి లభించగా, కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అక్కడి ప్రజల తాగునీటి అవసరాల కోసం 0.50 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి కూడా ఆమోదం లభించినట్లు ఆయన వెల్లడించారు.ఈ మేరకు గురువారం ఉదయం నుంచి ఎల్‌ఎల్‌సీ కాలువలోకి నీటి ప్రవాహాన్ని అధికారులు ప్రారంభించారు. కాలువ ద్వారా రోజుకు 1,000 క్యూసెక్కుల చొప్పున తాగునీటి సరఫరా జరగనుండగా, ఈ నీటి విడుదల 10 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు.ఈ నీటి పంపిణీలో భాగంగా ప్రతిరోజూ కర్ణాటక వాటాకు 200 క్యూసెక్కులు, ఆంధ్రప్రదేశ్ వాటాకు 800 క్యూసెక్కులు చొప్పున నీరు విడుదల చేయనున్నట్లు వివరించారు. దీంతో రెండు రాష్ట్రాల్లోని కాలువ పరిధిలో ఉన్న గ్రామాలకు తాగునీటి సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందని పేర్కొన్నారు.వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని డా. పురుషోత్తమ గౌడ్ తెలిపారు. కాలువ పరిధిలోని రైతులు, గ్రామస్తులు నీటిని వృథా చేయకుండా జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అధికారుల సమన్వయంతో సమయానికి నీటి విడుదల చేపట్టడం అభినందనీయమని, భవిష్యత్తులో కూడా తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాలను కోరారు. ఈ నీటి విడుదలతో కర్నూలు, బళ్లారి జిల్లాల ప్రజలకు తాగునీటి పరంగా గణనీయమైన ఊరట లభించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *