NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం పర్యటన విజయవంతానికి అత్యవసర సమావేశం

1 min read

– టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి పిలుపు

ఆలూరున్యూస్ నేడు: ఈ నెల 25న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆస్పరి మండలంలో పర్యటించనున్న సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాబోయే రెండు రోజుల్లో అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి తెలిపారు.ఈ సమావేశానికి మండల కన్వీనర్లు, సొసైటీ అధ్యక్షులు, జిల్లా నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులు తప్పనిసరిగా హాజరై కార్యక్రమ విజయవంతానికి తీసుకోవాల్సిన ఏర్పాట్లపై చర్చించాలని ఆమె పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి పర్యటనను భారీ జనసమీకరణతో చారిత్రాత్మకంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి పార్టీ నాయకుడు, కార్యకర్తపై ఉందని వైకుంఠం జ్యోతి పేర్కొన్నారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని ఆమె కోరారు.

About Author