NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశీయ ఆక్వా ఉత్పత్తులకు ప్రపంచ స్థాయి ప్రాచుర్యం రావాలి

1 min read

విదేశీ ఎగుమతులను ప్రోత్సహించి రైతులను ఆదుకోవాలి

ఆక్వా కింగ్ ద్విభాషా మాసపత్రిక బ్రోచర్ ను ఆవిష్కరించిన ప్రముఖ పారిశ్రామిక వేత్త అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: దేశీయ ఆక్వా ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం లభించాల్సిన ఆవశ్యకత ఉందని, ఇందుకు సంబంధించిన నివేదికను కేంద్ర ఆర్ధికశాఖా మంత్రి నిర్మలా సీతారమన్ కు సీఎం చంద్రబాబు  నివేదించడం శుభ ప్రరిణామమని ప్రముఖ పారిశ్రామిక వేత్త, దీపక్ నెక్స్ జెన్ మేనేజింగ్ డైరెక్టర్ అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం అన్నారు. ఏలూరు కేంద్రంగా త్వరలో వెలువడనున్న ఆక్వా కింగ్ ద్విభాషా మాసపత్రిక బ్రోచర్ ను దీపక్ నెక్స్ జెన్  కార్యాలయంలో శనివారం ఆయన ఆవిష్కరించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఫిష్ మీల్ టన్ను రూ.1.55 లక్షల నుంచి రూ.2.40 లకు పెరిగిందని, అలాగే చేప నూనె టన్ను రూ.2.80 లక్షల నుంచి రూ.4.40 లక్షలకు, సోయా లెసిథిన్ టన్నుకు రూ.68 వేల నుంచి రూ.1.10 లక్షలకుచేరిందన్నారు. రొయ్య మేతకు సంబంధించిముడిపదార్ధాల భారం టన్నుకు సుమారు రూ.25 వేల వరకూ పెరగటంతో మేతల ధరలు పెంపు అనివార్యమైందని, అయితే అందుకు అనుగుణంగా మార్కెట్ ధరలు పెరగడం లేదన్నారు.  రొయ్యలు, ఆక్వాకల్చర్ ఉత్పత్తులకుసంబంధించి దేశీయ మార్కెట్ ను ప్రోత్సహించ టం, విదేశాలకు ఎగుమ తులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఎపీపీఓలఏర్పాటు, మార్కెట్లో ఆక్వా రైతుల అనుసంధానం, దేశ, విదేశీ మార్కెట్లలోబ్రాండింగ్, ప్రాసెసింగ్, రీటైల్ ధరల ఏకీకరణకు మద్దతుఇవ్వాలన్నారు. అంతర్జా తీయ వాణిజ్య, ఎగుమతి వీలున్న కొత్త వంగడాలను సాగులోకి  తీసుకురావా ల్సిన అవసరం కూడా ఉందన్నారు. ఇత్యాది అంశాలను కేంద్ర మంత్రి ఆర్ధిక మంత్రి దృష్టికి సీఎం తీసుకువెళ్లడం సంతోష దాయకమన్నారు. ఆక్వా అభివృద్దిలో పత్రికలు, మేగజిన్లు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. ఆ దిశగా     ఆక్వా కింగ్ మాసపత్రికి తమ వంతు కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తొలుత సేవా తత్పరులు అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం ను అక్రిడేషన్ కమిటీ రాష్ట్ర సభ్యులు దుద్దే ఉదయ్ భాస్కర్, ఐజేయు జాతీయ సభ్యులు ఉర్ల శ్రీనివాస్, ఎపియుడబ్ల్యూజే ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ఉపాధ్యక్షులు దేవరపు విజయ్ కుమార్, పత్రిక చీప్ రిపోర్టర్, నిర్వాహకుడు ఎస్.కె.ఆర్షద్ భాషా, సీనియర్ జర్నలిస్ట్ డి.నానిబాబు, సరిపల్లి బాబీలు శాలువా, బొకేలతో సత్కరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *