” స్పెషల్ లోక్ అదాలత్”
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ప్రధాన న్యాయమూర్తి జి. కబర్థి ఆధ్వర్యంలో శనివారం 18-07-2026 న జరిగిన స్పెషల్ లోక్ అదాలత్ లో ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలలో 34 చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం అయ్యాయి. మొత్తం రెండు జిల్లాల్లో 16 బెంచీలను ఏర్పాటు చేసి 34 చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించామని తెలిపారు. ఈ స్పెషల్ లోక్ అదాలత్ లో కర్నూలు లో జిల్లా కోర్ట్ ల కు చెందిన చెక్ బౌన్స్ కేసులను ఏడవఅదనపు జిల్లా జడ్జి లక్ష్మీరాజ్యం , మేజిస్ట్రేట్ కోర్ట్ లకు చెందిన చెక్ బౌన్స్ కేసులను ఎక్సైజ్ కోర్టు మెజిస్ట్రేట్ అనిల్ కుమార్ పరిష్కరించారు.


