స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ …
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్. భాస్కర్ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత మరియు స్వచ్ఛత గురించి ఆరోగ్య సిబ్బందికి ప్రజలకు అవగాహన కల్పించాలని , పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉండాలని, తద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, చెత్తాచెదారాలను రోడ్లమీద, బహిరంగ ప్రదేశాలలో, మురికి కాలువల్లో పడేయకుండా చెత్త బుట్టలను ఉపయోగించాలని, ఇంటి పరిసరాల్లో మురికి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని పరిసరాలు శుభ్రంగా ఉంటేనే దోమలు ఈగలు క్రిమి కీటకాలు పెరగవు దీనివల్ల డెంగ్యూ మలేరియా వంటి ప్రమాద వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. కాలుష్య నివారణ ప్లాస్టిక్ వాడకండి అన్నారు . ఈ కార్యక్రమంలో డా. ఉమా ఇమ్మ్యూనైజేషన్ ఆఫీసర్ , రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్. మహేశ్వరా ప్రసాద్, డిపి యం యు డాక్టర్. శైలేష్ కుమార్,హేమ సుందర్ ,, డెమో ప్రకాష్ రాజ్ సార్ హెచ్ ఈ ఈ ఓ బాబా ఫక్రుద్దీన్ డిప్యూటీ డెమో షఫీ వున్నిసా బేగం ,డిపి హెచ్ ఎన్ ఓ అన్నపూర్ణ,డిప్యూటీ హెచ్ ఈ ఓ పద్మావతి మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


