పంటల భీమా ప్రీమియం చెల్లింపు ఆఖరి తేదీని ఆగస్టు 15 కి పొడిగించాలి
1 min read
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్.
న్యూస్ నేడు, పత్తికొండ: అన్ని పంటలతోపాటు పత్తి, వేరుశనగ, టమాటా రైతుల పంట భీమా ప్రీమియం చెల్లింపు ఆఖరి తేదీని ఆగస్టు 15కి పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి డి రాజా సాహెబ్, నియోజకవర్గ కార్యదర్శి బి సురేంద్ర కుమార్, గౌరవాధ్యక్షులు ఎం కారన్న సిపిఐ మండల కార్యదర్శి కారుమంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితి వరకు నియోజవర్గ ప్రతినిధి బృందం కలిసి శనివారం పత్తికొండ తహసీల్దార్ హుస్సేన్ సాహెబ్ కి వినతిపత్రo అందజేశారు.ఈ సందర్భంగా తహసీల్దార్ హుస్సేన్ సాహెబ్ తో వారు మాట్లాడుతూ, పంటల భీమయ్య ప్రీమియం చెల్లింపు ఆఖరి సమయం చాలా తక్కువగా ఇచ్చినందున రైతులు మీసేవ కేంద్రాల్లో అనేకచోట్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలామంది రైతులకు విషయం కూడా తెలియని పరిస్థితి ఉందని, అందువల్ల అన్ని పంటలతో పాటు పత్తి వేరుశనగ టమాట మిరప జున్న కొజ్జ కోర్ర అందము కంది మొక్కజొన్న వరి పండించిన రైతుల పంట బీమా సమయాన్ని ఆగస్టు 15వ తేదీ వరకు పొడిగించాలని వారు తహసీల్దార్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ విషయాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని వారు కోరారు. ఈ సందర్భంగా డి. రాజా సాహెబ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్ రబీ సీజన్లో రైతులు పండిస్తున్న పంటలకు బీమా కల్పించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమా పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు ప్రకటన చేసిందని ప్రధానమంత్రి ఫసల్ బీమా ప్రీమియం చెల్లింపు జులై 31 వరకు ఇచ్చారు. కానీ వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంలో పత్తి వేరుశనగ టమోటా పంటలకు బీమా ప్రీమియం.


